టీఆర్ఎస్ ఎంపీకి కరోనా పాజిటివ్

మహబూబాబాద్ టీఆర్‍ఎస్ ఎంపీ మాలోతు కవితకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‍లో హోం ఐసోలేషన్‍లో ఉన్నట్లు కవిత వెల్లడించారు. ఇటీవల తనను కలిసిన వారంతా కొవిడ్ టెస్టులు చేయించుకోవాలని, ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని ఎంపీ సూచించారు.