మండలి చైర్మన్‌గా మరోసారి.. గుత్తా సుఖేందర్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్‌గా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి రెండోసారి పదవీ బాధ్యతలు స్వీకరించారు. మండలి చైర్మన్‌గా సుఖేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికకు ఒకే ఒక్క నామినేషన్ రావడంతో గుత్తా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు మండలి అధికారులు ప్రకటించారు. 2019 సెప్టెంబర్ 11న తొలిసారి గుత్తా సుఖేందర్ రెడ్డి మండలి చైర్మన్‌గా బాధ్యలు స్వీకరించారు. 2021, జూన్ మొదటి వారం వరకు గుత్తా మండలి చైర్మన్‌గా సేవలందించారు. గుత్తా ఎమ్మెల్సీ పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో ప్రొటెం చైర్మన్‌గా ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డిని నియమించారు. శానసమండలికి 2021 లో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా గుత్తా సుఖేందర్ రెడ్డి రెండోసారి నవంబర్ 22న ఎన్నికయ్యారు. ఈ క్రమంలో మళ్లీ ఆయన రెండోసారి మండలి చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు.













