టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్

వికారాబాద్ జిల్లాలోని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి కరోనా సోకింది. కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించగా కోవిడ్ సోకినట్లు నిర్ధారణ అయినట్లు తేలింది. తన స్నేహితుల ద్వారా కరోనా వచ్చినట్లు గుర్తించారు. అయితే ప్రస్తుతం తన ఆరోగ్యం మెరుగ్గానే ఉందని, వైద్యుల సూచన మేరకు హోమ్ ఐసోలేషన్‍ల్లో ఉన్నట్లు చెప్పారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా తాండూరు పర్యటనలో తనను కలిసి వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అందరూ మాస్కులు ధరించి, కొవిడ్ నిబంధలను పాటించాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ శ్రేణులు, నాయకులు అభిమానులు ఎవరూ కూడా తనను కలవడానికి రావద్దని, ఎవరు ఆందోళన కూడా పడొద్దని కోరారు