సాగర్ కు ఆయన ఏం చేయలేదు… మళ్లీ ఓడించి ఇంటికి
నాగార్జున సాగర్ అభివృద్ధికి జానారెడ్డి చేసిందేమీ లేదని, ఆయనను ఓడించి మళ్లీ ఇంటికి పంపాల్సిందేనని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. సాగర్ టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్‌కు మద్దతుగా పెద్దవురా మండలం ఊరబాయి తండాలో మంత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నోముల నరసింహయ్య అకాల మరణం చెందడంతో ఉప ఎన్నికలు వచ్చాయన్నారు. నోముల వారసుడు భగత్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తండాలను జానారెడ్డి పట్టించుకోలేదు వారి బాధలు ఆయనకు అసలే పట్టవు అంటూ ధ్వజమెత్తారు. అర్థం లేని మాట్లాడుతూ జానారెడ్డి ఆగమాగం అవుతున్నాడని విమర్శించారు. ఇండ్ల నిర్మాణల కోసం సీఎం కేసీఆర్ బడ్జెట్లో నిధులు కేటాయించారు. త్వరలోనే మీ సొంత జాగాల్లో ఇండ్లు నిర్మించుకునేందుకు సీఎం కేసీఆర్ నిధులు మంజూరు చేస్తారని అన్నారు.













