ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. నల్గొండ, వరంగల్, రంగారెడ్డి ఎమ్మెల్సీ స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై 825 ఓట్ల ఆధిక్యంతో ఘన విజయం సాధించారు. నల్గొండలో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి లక్ష్మీపై టీఆర్ఎస్ అభ్యర్థి చిన్నపరెడ్డి 226 ఓట్ల తేడాతో గెలుపొందారు. రంగారెడ్డి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి ప్రతాప్‌రెడ్డిపై 244 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.













