న్యూజిలాండ్ నుంచి హైదరాబాద్ కి వంశీరెడ్డి చింతా రెడ్డి మృతదేహం
వంశీ రెడ్డి చింతా రెడ్డి హైదరాబాద్ (తెలంగాణ రాష్ట్రం)కి చెందినవాడు మరియు స్టూడెంట్ వీసాపై తొమ్మిదేళ్ల క్రితం న్యూజిలాండ్‌కు వెళ్లి ప్రస్తుతం ఆష్బర్టన్లో డైరీ ఫామ్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. వంశీ రెడ్డి చింతా రెడ్డి న్యూజిలాండ్ లో మరణించారు. ఎమ్మెల్సీ తాతా మధు ద్వారా వంశీ బంధువులు తెరాస ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేష్ బిగలా గారిని సంప్రదించగా అక్కడ నుంచి వంశీ రెడ్డి పార్థివ దేహాన్ని తరలించేందుకు కాన్సులేట్ మరియు న్యూజిలాండ్ తెలుగు అసోసియేషన్ (NZTA), తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ న్యూజిలాండ్ (TANZ) మరియు మన ఆంధ్ర తెలుగు అసోసియేషన్ (MATA) తో మాట్లాడి స్వదేశానికి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
మహేష్ బిగల మాట్లాడుతూ న్యూజిలాండ్ లో TRS NRI NZ అధ్యక్షుడు జగన్ వోదనల, తెలంగాణ సీనియర్ నాయకుడు కళ్యాణ్ రావు కాసుగంటి కావాల్సిన ఏర్పాట్లను చూస్తున్నారు. తెలంగాణ లో NRI ఇంచార్జి చిట్టిబాబు గారితో మాట్లాడి అన్ని ఏర్పాట్లు చేసినట్టు మహేష్ తెలిపారు అలాగే అక్కడ న్యూజిలాండ్ లో సహాయ సహకారాలు అందిస్తున్న అందరికి కృతజ్ఞతలు తెలిపారు.













