విదేశాలకు వెళ్లే విద్యార్థుల కోసం.. 5 నుంచి

ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు వ్యాక్సిన్ వేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయంతో ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు నారాయణగూడలోని ఇన్‍స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం)లో వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ఇందుకోసం ముందుగా ఈ నెల 4 నుంచి స్లాట్ బుక్ చేసుకోవడానికి హెల్త్,తెలంగాణ. జీవోవి.ఇన్ వెబ్‍సైట్‍లో స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు. ఐదవ తేదీ నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభించనున్నట్టు రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జి.శ్రీనివాసరావు తెలిపారు.