మోత్కుపల్లి త్వరలో శుభవార్త వింటారు
నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి అంచలంచెలుగా ఎదిగిన వెంకయ్యనాయుడుకి ఉపరాష్ట్రపతి పదవి దక్కడం తెలుగువారందరికీ గర్వకారణమని తెలంగాణ తెలుగుదేశం నేతలు కొనియాడారు. బంజారాహిల్స్‌లోని వెంకయ్యనాయుడు నివాసానికి వెళ్లిన ఎల్.రమణ, మోత్కుపల్లి నర్సింహులు, నామా నాగేశ్వరరావు, రావుల చంద్రశేఖర్‌రావు తదితరులు ఆయనకు అభినందనలు తెలిపారు. ఉపరాష్ట్రపతి పదవికి వెంకయ్యనాయుడు వన్నె తెస్తారని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు పిచ్చిపాటిగా మాట్లాడుతూ, మోత్కుపల్లి త్వరలో గవర్నర్ హోదా దక్కబోతోందని వ్యాఖ్యానించినట్లు సమచారం.













