దావోస్ సదస్సులో తెలంగాణకు… ప్రత్యేక వేదిక
దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక వేదికను ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలను చాటేలా రూపొందించిన ఈ వేదిక సదస్సుకు హాజరైన వారిని ఆకర్షిస్తోంది. బతుకమ్మ, బోనాల పండుగలు, చారిత్రక చార్మినార్ కట్టడం, చేర్యాల పెయింటింగ్, పోచంపల్లి ఇక్కత్ చీరలు, టీ హబ్, స్కైరూట్ ఏరోస్పేస్ ఇలా విభిన్న అంశాల మేళవింపుతో తయారు చేసిన వాల్ డిజైనింగ్ ఈ పెలివియన్కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారీగా పెట్టుబడులను ఆకర్షించేందుకు మీ కోసమే తెలంగాణ అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హోర్డింగ్ ప్రపంచ దిగ్గజ కంపెనీలను ఆకట్టుకునేలా ఉంది.













