తెలంగాణలో పతంజలి
తెలంగాణలో ఆహారశుద్ధి పరిశ్రమ ఏర్పాటుకు పతంజలి సంస్థ ముందుకొచ్చింది. ఈ మేరకు హరిద్వార్‌లో బాబారాందేవ్, ఆచార్య బాలకృష్ణ, టీఆర్ఎస్ ఎంపీ కవిత సమక్షంలో సంస్థ ప్రతినిధులు, తెలంగాణ ప్రభుత్వ అధికారులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. పసుపు ఉత్పత్తిలో ముందజంలో ఉన్న తెలంగాణ ఆయుర్వేద, ఆహార ఉత్పత్తుల సంస్థను ఏర్పాటు చేయాలని గతంలో రాందేవ్‌ను ఎంపీ కవిత కోరారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం లక్కంపల్లిలో ఆహారశుద్ధి పరిశ్రమ ఏర్పాటుకు పతంజలి అంగీకరించింది. ఇక్కడ పసుపు, మిర్చి, మక్కలు, సోయా సుగంధ ద్రవ్యాలు, తృణధాన్యాలను శుద్ధి చేసి వాటిని దేశంలోని పతంజలి యూనిట్లకు సరఫరా చేస్తారు. ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, తెలంగాణ ఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్ ఈవీ నరసింహారెడ్డి తదితరులు ఎంపీ కవిత బృందంలో ఉన్నారు.













