ఎన్నికల కమిషనర్ కు కరోనా పాజిటివ్

ప్రభుత్వంలో ఉన్నతాధికారులను సైతం వైరస్ మహమ్మారి వదలడం లేదు. తాజాగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థసారథి కరోనా బారిన పడ్డారు. ఆయనకు కోవిడ్ పరీక్ష నిర్వహించగా ఫలితాలు వచ్చాయి. తనకు పాజిటివ్‍గా నిర్ధారణైందని పార్థసారథి ధ్రువీకరించారు. స్వల్పజ్వరంతో బాధపడుతున్నట్లు తెలిపారు. కాగా ఈ నెల 28న నిమ్స్ లో ఆయన కోవిడ్ టీకా తొలిడోసు వేసుకున్నారు.