తెలంగాణలో గడిచిన 24 గంటల్లో…. 5,892 కేసులు

తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 76,047 టెస్టులు చేయగా.. 5,892 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్‍లో తెలిపింది. మరో 46 మంది మరణించారు. దీంతో వైరస్ బారినపడి మొత్తం 2,625 మంది ప్రాణాలు విడిచారు. ప్రస్తుతం రాష్ట్రంలో 73,851 క్రియాశీల కేసులు ఉన్నాయని తెలిపింది. 24 గంటల్లో 9,122 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,81,640కు చేరగా.. ఇప్పటి వరకు 4,05,164 మంది కోలుకున్నారు.కొత్తగా నమోదైన కేసుల్లో జీహెచ్‍ఎంసీలో 1,104, మేడ్చల్ మల్కాజ్‍గిరి జిల్లాలో 378, రంగారెడ్డి 443, వరంగల్ అర్బన్‍లో 321, నల్గొండలో 323, సిద్దిపేటలో 201, కరీంనగర్‍లో 263, నాగర్ కర్నూల్‍లో 204, మహబూబ్‍నగర్ 195 కేసులు నమోదయ్యాయని తెలిపింది. రాష్ట్రంలో రికవరీ రేటు 84.12 శాతం ఉండగా, మరణాల రేటు 0.54 శాతంగా ఉంది.