తెలంగాణలో కొత్తగా 5,695 కేసులు.. 49 మంది

తెలంగాణ రాష్ట్రంలో కరోనా విలయం కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 5,695 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 4,56,485కి చేరింది. నిన్న ఒక్క రోజే 49 మంది కరోనా వైరస్‍తో ప్రాణాలొదిలారు. దీంతో మొత్తం సంఖ్య 2,417 కి చేరింది. అయితే తాజాగా 6,206 మంది కోలుకోవడంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 3,73,933కి చేరడం గమనార్హం. రాష్ట్రంలో 80,153 యాక్టివ్ కేసులున్నాయని పేర్కొంది. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‍ఎంసీలో 1,352, మేడ్చల్ 427, రంగారెడ్డి 483 కరోనా కేసులు నమోదయ్యాయి.