తెలంగాణలో రికార్డు స్థాయిలో కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,21,880 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 3,840 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. నిన్న కరోనాతో 9 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 1,797కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 1198 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 3,09,594కి చేరింది. ప్రస్తుతం 30,494 యాక్టివ్ కేసులు ఉన్నాయని, వారిలో 20,215 మంది హోం ఐసోలేషన్‍లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. కొత్తగా నమోదైన కేసులో అత్యధికంగా 505 జీహెచ్‍ఎంసీలో, మేడ్చల్‍లో 407, రంగారెడ్డిలో 302, నిజామాబాద్‍లో 303, సంగారెడ్డిలో 175 అత్యధికంగా కొవిడ్ కేసులు నమోదయ్యాయి.