పారిస్‌లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి బృందం

పారిస్‌లో జరుగుతున్న ఒలింపిక్స్ పోటీలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి బృందం తిలకించింది. భారత క్రీడాకారులు ఇషా సింగ్ (షూటర్), నిఖత్ జరీన్ ( బాక్సర్)లతో పాటు ఇతర క్రీడాకారులను కలిసి మద్దతు తెలిపింది. క్రీడాకారులకు అక్కడ కల్పిస్తున్న సౌకర్యాలను పర్యవేక్షించింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈ నెల 3వ తేదీన శాట్జ్ చైర్మన్ శివసేనారెడ్డి, ఎండీ సోనీ బాలాదేవీ, ప్రభుత్వ సలహాదారులు జితేందర్ రెడ్డి, వేణుగోపాలచారి, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, ఇతర అధికారులు పారిస్ వెళ్లిన విషయం తెలిసిందే.