ప్రపంచవ్యాప్తంగా 29న దీక్షా దివస్
ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 29న దీక్షా దివస్ను నిర్వహించనున్నట్టు ఎన్నారై గ్లోబల్ సెల్ కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల తెలిపారు. ఈ సందర్భంగా దీక్షా దీవస్ స్ఫూర్తిని, అమరుల త్యాగాలని, జ్ఞాపకాలను, పోరాటాలను స్మరించుకొంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నారైలు దీక్షా దివస్ను నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. వందలాది తెలంగాణ బిడ్డల బలిదానాలకు కారణమైన కాంగ్రెస్కు ప్రజలు బుద్ధి చెప్పాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2009న నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారని గుర్తు చేశారు. యావత్తు సమాజం కేసీఆర్ వెంట నిలవడంతోనే కేంద్రం దిగొచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని తెలిపారు.













