తెలంగాణలో మళ్లీ కరోనా విజృంభణ…

తెలంగాణ రాష్ట్రంలో తాజాగా రికార్డు స్థాయిలో కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 59,297 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 887 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. నిన్న కరోనాతో నలుగురు మృతిచెందారు. దీంతో ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 1701కి చేరింది. కరోనా నుంచి మరో 337 మంది బాధితులు కోలుకున్నారు. మొత్తం కోలుకున్న వారి సంఖ్య 3,01,564గా నమోదైంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 5,511 యాక్టివ్ కేసుల్లో 2,166 మంది హోం ఐసోలేషన్‍లో చికిత్స పొందుతున్నారు. జీహెచ్‍ఎంసీ పరిధిలో కొత్తగా 201, మేడ్చల్‍లో 79, నిర్మల్‍లో 78 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఇప్పటి వరకూ నిర్వహించిన మొత్తం కరోనా పరీక్షల సంఖ్య 1,02,10,906కు చేరింది.