తెలంగాణలో కొత్తగా 7,994 కేసులు…

తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 7,994 కేసులు నమోదు కాగా, 58 మంది బాధితులు మృతి చెందినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం 4,27,960 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 3,49,692 మంది కరోనా బాధితులు వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, 2,208 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ప్రస్తుతం 76,060 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. జీహెచ్‍ఎంసీ పరిధిలో 1,630, మేడ్చల్ 615, రంగారెడ్డి 558, నిజామాబాద్ 301, మహబూబ్‍నగర్ 263, ఖమ్మం 213, వరంగల్ అర్బన్ 162, నల్గొండలో 424, సంగారెడ్డిలో 337, సూర్యపేటలో 264, సిద్దిపేటలో 269, జగిత్యాలలో 238, మంచిర్యాలలో 201 కొవిడ్ కేసులు నమోదు అయ్యాయి.