తెలంగాణలో కొత్తగా 4,801 కేసులు.. 32 మంది

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 75,289 మందికి పరీక్షలు నిర్వహించగా 4,801 మందికి పాజిటివ్‍గా నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసిది. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 5,06,988కి చేరింది. కరోనా వైరస్ నుంచి 7,430 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో 60,136 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,37,54,216 మందికి కరోనా పరీక్షలు చేశారు. జీహెచ్‍ఎంసీ పరిధిలో 756, మేడ్చల్ 327, రంగారెడ్డి జిల్లాలో 325 కేసులు నమోదయ్యాయి. తాజాగా కరోనాతో 32 మంది మృతి చెందారు. కొత్త మరణాలతో కలిపి రాష్ట్రవ్యాప్తంగా 2,803 మంది మృతి చెందారు.