తెలంగాణలో కొత్తగా 3,464 కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 65,997 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 3,464 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్ విడుదల చేసింది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 5,47,727 చేరింది. తాజాగా 25 మంది ప్రాణాలు కోల్పోగా, మొత్తం మృతుల సంఖ్య 3,085కి పెరిగింది. ఇవాళ 4,801 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 44,395 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జీహెచ్‍ఎంసీ పరిధిలో 534, రంగారెడ్డి జిల్లాలో 243, మేడ్చల్ జిల్లాలో 219 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.