నాలుగు స్థానాల్లో టీజేఎస్ పోటీ
లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ జన సమితి నాలుగు స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరాం వెల్లడించారు. కరీంనగర్, నిజామాబాద్, మల్కాజ్గిరి లోక్సభ స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. మరో స్థానంపై పార్టీలో విస్తృతంగా చర్చించిన అనంతరం నిర్ణయం తీసుకుంటామన్నారు. టీజేఎస్ పోటీ చేయని చోట కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తామని సృష్టం చేశారు. అయితే తాము ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవడం లేదని ఆయన సృష్టం చేశారు. మ్యానిఫెస్టోను త్వరలో ప్రకటిస్తామని అన్నారు. స్థానిక ఎన్నికల్లో సైతం పోటీ చేస్తామన్నారు.













