జీబీబీసీ ఇండియా అంబాసిడర్‌గా తెలంగాణ
ప్రపంచవ్యాప్తంగా టాప్-10 బ్లాక్‌చైన్ నగరాల్లో హైదరాబాద్‌ను నిలుపవడంలో భాగంగా బ్లాక్‌చైన్ డిస్ట్రిక్ట్‌ను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. బ్లాక్‌చైన్ టెక్నాలజీ (బీటీ)ని సమర్థంగా వినియోగిస్తున్నందుకు గ్లోబల్ బ్లాక్‌చైన్ బిజినెస్ కౌన్సిల్ (జీబీబీసీ) ఇండియా అంబాసిడర్ తెలంగాణ రాష్ట్రాన్ని ఎంపిక చేసింది. స్విస్ ద్వీపంలో సర్ రిచర్డ్ బ్రాన్సన్స్ నెక్కర్ పేరుతో ఉద్భవించిన జీబీబీసీ లాభపేక్ష లేని సంస్థ. 50 దేశాల్లో బీటీని వినియోగిస్తున్న బిబినెస్ లీడర్లు, రెగ్యులేటర్లను ఒకతాటిపైకి తీసుకొచ్చి, దానిని మరింత పటిష్ఠంగా రూపొందించాలనే అంశంపై అవగాహన కల్పిస్తున్నది. బ్లాక్‌చైన్ టెక్నాలజీని వినియోగించుకొని ఆయా ప్రభుత్వ శాఖల్లోని సవాళ్లను పరిష్కరిస్తున్నది.













