తెలంగాణ సీఎస్ కు హైకోర్టులో ఎదురుదెబ్బ
తెలంగాణ సీఎస్ సోమేశ్‌కుమార్‌కు రాష్ట్ర హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. క్యాడర్ కేటాయింపు వివాదంపై ఉన్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. ఈ వ్యవహారంలో గతంలో కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (క్యాట్) ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. తెలంగాణలో సీఎస్ సోమేశ్ కుమార్ కొనసాగింపును రద్దు చేసింది. అప్పీలుకు వెళ్లేందుకు తీర్పు అమలును 3 వారాలు నిలిపివేయాలని ఆయన తరపు న్యాయవాది అభ్యర్థనను ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది రాష్ట్ర విభజన సమయంలో సోమేశ్‌కుమార్‌కు కేంద్ర ప్రభుత్వం ఏపీకి కేటాయించింది. కేంద్రం ఉత్తర్వులు నిలిపివేసి ఆయన తెలంగాణలో కొనసాగేలా గతంలో క్యాట్ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులతో తెలంగాణలో సోమేశ్ కుమార్ కొనసాగుతున్నారు. క్యాట్ ఉత్తర్వులను కొట్టివేయాలని 2017లో నే కేంద్రం హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు సీజే జస్టిస్ ఉజ్జల్ భూయన్ ధర్మాసనం తాజాగా ఆదేశాలు జారీ చేసింది.













