తెలంగాణలో కరోనా విజృంభణ…

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 965 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో కరోనాతో నిన్న ఐదుగురు మరణించారు. కరోనాతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 1,706కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 312 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 6,159 యాక్టివ్ కేసులు ఉన్నాయని, వారిలో 2,622 మంది హోం ఐసోలేషన్‍లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. జీహెచ్‍ఎంసీ పరిధిలో మరో 254 కేసులు నమోదయ్యాయి. జీహెచ్‍ఎంసీతో పాటు జిల్లాల్లోనూ పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి.