తెలంగాణలో భారీగా డిప్యూటీ కలెక్టర్లు బదిలీ

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 8 మంది స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, 32 డిప్యూటీ కలెక్టర్లు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జగిత్యాల అదనపు కలెక్టర్ ( రెవెన్యూ)గా పర్సా రాంబాబు. హనుమకొండ అదనపు కలెక్టర్‌గా ఎ.వెంకట్‌రెడ్డి, సూర్యాపేట అదనపు కలెక్టర్‌గా బీఎస్ లత, ములుగు అదనపు కలెక్టర్‌గా సీహెచ్ మహేందర్, భద్రాద్రి కొత్తగూడెం అదనపు కలెక్టర్‌గా. డి.వేణుగోపాల్ బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.