తెలంగాణలో వ్యాక్సిన్ డెలివరికి… డ్రోన్

తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కోసం డ్రోన్‍ల వినియోగానికి కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలంగాణ ప్రభుత్వానికి అనుమతి మంజూరు చేసింది. ఏడాదిపాటు అనుమతి అమలులో ఉండనుందని డీజీసీఏ పేర్కొంది. డ్రోన్లను ఉపయోగించి వ్యాక్సిన్లను ప్రయోగాత్మకంగా పంపిణీ చేసేందుకు మానవరహిత విమాన వ్యవస్థ (యూఏఎస్)-2021 నిబంధనలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వానికి షరతులతో కూడిన అనుమతులు ఇస్తున్నట్లు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తన అధికార ట్విట్టర్‍లో ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వం వ్యాక్సిన్ల పంపిణీ కోసం ఈ ఏడాది మార్చి 9న మానవరహిత విమాన వ్యవస్థ (యూఏఎస్)-2021 నిబంధనల నుంచి మినహాయింపు ఇవ్వాలని డీజీసీఏను కోరింది.