ప్రైవేట్ ఆస్పత్రులూ ఇకపై వ్యాక్సిన్ వేయవచ్చు : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

వ్యాక్సినేషన్ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వ్యాక్సిన్ వేసేందుకు ప్రైవేట్ ఆస్పత్రులకూ అనుమతినిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అనుమతులు కూడా మంజూరు చేసింది. వ్యాక్సిన్ కోసం ప్రైవేట్ సంస్థలు ప్రైవేట్ ఆస్పత్రులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని ప్రభుత్వం సూచించింది. మరోవైపు, పది రోజుల తర్వాత మంగళవారం నుంచి తెలంగాణలో వ్యాక్సినేషన్ ప్రక్రియ పున: ప్రారంభమైంది. వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద రెండో డోసు కోసం ప్రజలు ఎక్కువ సంఖ్యలో వచ్చి చేరారు. ఇక్కడి నుంచి వ్యాక్సినేషన్‌కు అంతరాయం కలగకుండా, నిరాటంకంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను కొనసాగించాలని తెలంగాణ సర్కార్ కృతనిశ్చయంతో ఉంది. ఇక… ఈ నెల 28 తర్వాత కరోనా యోధులకు కరోనా వ్యాక్సిన్ వేయనున్నారు. షాప్ కీపర్స్, ఆటో డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లు, సెలూన్, మెడికల్ షాపులతో పాటు జనాలతో ఎక్కువగా కాంటాక్ట్‌లోకి వెళ్లే వారికి వ్యాక్సినేషన్ వేయనున్నారు.