మేడారం రావాలని ఉపరాష్ట్రపతికి ఆహ్వానం
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న మేడారం సమ్మక్క సారక్క జాతరకు రావాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆహ్వానించారు. ఉపరాష్ట్రపతితో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలచారి, ఎంపీలు సీతారాంనాయక్, నగేశ్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలతో కలిసి ఇంద్రకరణ్‌రెడ్డి భేటీ అయ్యారు. సుమారు కోటి మంది భక్తులు హాజరయ్యే మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని కేంద్రానికి సూచించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఇంద్రకరణ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 3 వరకు నిర్వహించే జాతరకు రావాలని కోరగా ఉపరాష్ట్రపతి సానుకూలంగా స్పందించారన్నారు.













