మోదీతో గవర్నర్ తమిళిసై భేటీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ భేటీ అయ్యారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో బహిరంగ సభ ముగిసిన తర్వాత ప్రధాని నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లారు. రాత్రి రాజ్‌భవన్‌లోనే మోదీ బస చేశారు. రాజ్‌భవన్‌కు రాగానే మోదీని గవర్నర్ సాదరంగా స్వాగతించారు. అనంతరం ఇరువురూ కలిసి డిన్నర్ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పరిస్థితులపై గవర్నర్ ప్రధానికి వివరించినట్లు సమాచారం. రాజ్‌భవన్, ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) మధ్య నెలకొన్న వివాదం, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ప్రొటోకాల్ నిబంధనలు ఉలంఘిస్తుండడం వంటి అంశాలను ప్రధాని దృష్టికి గవర్నర్ తీసుకెళ్లినట్లు సమాచారం.













