ఫిబ్రవరి 17న తెలంగాణ సచివాలయం ప్రారంభం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న కొత్త సచివాలయ ప్రారంభానికి ముహూర్తం ఖరారయింది. ఫిబ్రవరి 17న ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన సచివాలయాన్ని ప్రారంభించనున్నారు. సీఎం కేసీఆర్ జన్మదినం రోజున సెక్రటేరియట్ ను ప్రారంభించాలని నిర్ణయించినట్టు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు. నూతన సచివాలయానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరును పెట్టిన విషయం తెసిందే. 150-200 ఏండ్ల వరకు చెక్కుచెదరకుండా ఉండేలా దీనిని నిర్మించారు. 20 ఎకరాల సువిశాలమైన స్థంలో రూ.617 కోట్లతో గ్రీన్ బిల్డింగ్ కాన్సెఫ్ట్ పద్ధతిలో సచివాలయ నిర్మాణ పనులు చేపట్టారు.













