తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కరోనా పాజిటివ్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని తెలంగాణ సీఎస్ ధ్రువీకరించారు. స్వల్ప లక్షణాలతో ఆయన తన ఫాం హౌజ్‌లో ఐసోలేషన్‌లో ఉన్నారని తెలిపారు. గత కొంత కాలంగా కేసీఆర్ ఫాం హౌజ్‌లోనే ఉంటున్నారు. ప్రత్యేక వైద్యుల బృందం సీఎంను పర్యవేక్షిస్తూనే ఉందని సీఎస్ తెలిపారు. కొన్ని రోజుల క్రిందటే సీఎం నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా హాలియా సభలో పాల్గొన్నారు.