వనదేవతలను దర్శించుకున్న సీఎం కేసీఆర్
మేడారం సమ్మక్క, సారమ్మను తెంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దర్శించుకున్నారు. వనదేవతల దర్శనానికి సీఎం ప్రత్యేక హెలికాప్టర్లో మేడారానికి చేరుకున్నారు. గద్దెపై కొలువుదీరిన సమ్మక్క, సారమ్మను సీఎం దర్శించుకుని మొక్కు చెల్లించుకున్నారు. మొదట సమ్మక్క అమ్మవారిని దర్శించుకుని, అనంతరం సారమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడే కొలువై ఉన్న గోవిందరాజు, పగిడిద్ద రాజును సీఎం దర్శించుకుని మొక్కు చెల్లించుకున్నారు. అమ్మవార్లకు తెలంగాణ రాష్ట్రం తరపున సీఎం చీర, సారాను సమర్పించారు. అమ్మ దీవెలను తెలంగాణ ప్రతీ బిడ్డ మీద ఉండాలని ముఖ్యమంత్రి కోరారు. వనదేవతలకు సీఎం నిలువెత్తు బంగారం సమర్పించుకున్నారు. హుండీలో కానుకులు వేశారు. దర్శనానంతరం దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సీఎం కేసీఆర్‌కు సమ్మక్క-సారమ్మ దేవత ఫొటో అందజేశారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఉన్నారు.













