తెలంగాణలో మూడు కార్పొరేషన్ లకు చైర్మన్లు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముగ్గురు టీఆర్ఎస్ నేతలకు రాష్ట్రస్థాయి ప్రభుత్వరంగ సంస్థల చైర్మన్లుగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సీఎం ఆదేశాల మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విద్య, సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా రావుల శ్రీధర్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర రోడ్ల అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా మెట్టు శ్రీనివాస్, మైనారిటీ ఆర్థిక సహకార సంస్థ చైర్మన్‌గా మహామ్మద్ ఇంతియాజ్ ఇషాక్‌లను నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో వీరు ముగ్గురు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.













