ఈ నెల 20న తెలంగాణ కేబినెట్ భేటీ

ఈ నెల 20న సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ కేబినెట్ భేటీ జరగనుంది. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఇందులో చర్చించనున్నారు. రాష్ట్రంలో వరదలు, కేంద్ర ప్రభుత్వం సాయంపై సమావేశంలో ప్రస్తావించనున్నారు. హైడ్రా పని విధానం`దీని చట్టబద్ధతకు ఆర్డినెన్స్ తీసుకొచ్చే అంశం, బీసీ రిజర్వేషన్, కులగణన, 200 పంచాయతీల ఏర్పాటు, రుణమాఫీ, రైతుభరోసాపై చర్చించే అవకాశం ఉంది.