మంత్రివర్గం ఉపసంఘం కీలక నిర్ణయం.. కోచింగ్ సెంటర్లపై

తెలంగాణలో విద్యా వ్యవస్థపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. మంత్రులు శ్రీధర్‌బాబు, సీతక్క ఆధ్వర్యంలో విద్యా వ్యవస్థలో తేవాల్సిన సంస్కరణలపై ఉపసంఘం చర్చించింది. కోచింగ్ సెంటర్ల నిర్వహణలో పాటించాల్సిన మార్గదర్శకాలపై కూడా చర్చ జరిగింది. కేంద్ర మార్గదర్శకాలు రాష్ట్రంలో అమలు కావట్లేదని కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు అమలు చేయాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని కోచింగ్ సెంటర్లలో కేంద్ర మార్గదర్శకాలను అమలు చేయాలని మంత్రి వర్గ ఉపసంఘం నిర్ణయించింది.