ఈటల రాజీనామాను ఆమోదించిన స్పీకర్

మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాను తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి ఆమోదించారు. శనివారం ఉదయం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, ఆ పత్రాన్ని అసెంబ్లీ కార్యదర్శికి అందజేసిన విషయం తెలిసిందే. అయితే ఈ రాజీనామా పత్రం సరిగ్గా స్పీకర్ ఫార్మెట్‌లోనే ఉన్న నేపథ్యంలో స్పీకర్ పోచారం ఆ రాజీనామాను ఆమోదించారు. దీనికి ఎలాంటి సాంకేతిక పరమైన సమస్యలు అడ్డురాలేదు. మరోవైపు ఈ నెల 14న ఈటల బీజేపీలో చేరనున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సమక్షంలో ఆయన బీజేపీ సభ్యత్వం తీసుకోనున్నారు. ఈయనతో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, కరీంనగర్ జడ్పీ మాజీ చైర్మన్ తుల బీజేపీలో చేరనున్నారు.