తెలంగాణలో మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు
తెలంగాణ రాష్ట్రంలో మరో ప్రతిష్ఠాత్మక వైమానిక ప్రాజెక్టు ప్రారంభం కానుంది. ప్రసిద్ధ వైమానికి సంస్థ లాక్‌హీడ్ మార్జిన్ హైదరాబాద్‌లోని వైమానిక ఆర్థిక మండలిలో ఎఫ్-16 యుద్ధ విమానాల రెక్కల తయారీ పరిశ్రమను మూడు నెలల్లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే లాక్‌హీడ్ పరిశ్రమ ప్రతినిధులు హైదరాబాద్‌కు వచ్చి వైమానికి సెజ్‌లో స్థలాన్ని ఎంపిక చేశారు. ఈ పరిశ్రమ ఏర్పాటుకు లాక్‌హీడ్ ముందుకు రావడంపై పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్ ఆనందం వ్యక్తం చేశారు. అన్ని విధాల సహకరిస్తామన్నారు.













