కరోనా టీకా తీసుకున్న తెలంగాణ గవర్నర్

తెలంగాణ రాష్ట్ర గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కొవిడ్ టీకా తొలి డోసు తీసుకున్నారు. పుదుచ్చేరికి చెందిన వైద్య సిబ్బంది ఆమెకు టీకా ఇచ్చారు. పుదుచ్చేరిలోని రాజీవ్‍గాంధీ ప్రభుత్వ మహిళా, శిశవుల ఆస్పత్రిలో తమిళిసై టీకా తీసుకున్నారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ కరోనా కట్టడి కోసం ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని కోరారు. టీకాపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని సూచించారు.