ఆ ప్రచారం నమ్మొద్దు : తలసాని
మహర్షి సినిమా టికెట్ల ధరల పెంపునకు ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సృష్టం చేశారు. ప్రభుత్వ అనుమతులతో సింగిల్ స్క్రీన్ థియేటర్లో రూ.80 నుంచి 110లు, మల్టిఫెక్స్ థియేటర్లలో రూ.138 నుండి రూ.200ల వరకు సినిమా టికెట్ల ధరలను పెంచినట్లు పలువురు థియేటర్ల యాజమాన్యాలు చెప్పినట్లుగా వివిధ ప్రసార మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఆయన చెప్పారు. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పడూ సినిమా టికెట్ల ధరలను పెంచి దాఖలాలు లేవన్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. అగ్ర కథానాయకుడు మహేశ్ బాబు 25వ సినిమాగా రూపొందిన మహర్షి చిత్రం ఈ నెల 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే.













