నందకుమార్, రామచంద్ర భారతి మళ్లీ అరెస్ట్
టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో చంచల్‌గూడ జైలు నుంచి విడుదలైన నందకుమార్, రామచంద్ర భారతిని హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు మళ్లీ అరెస్టు చేశారు. బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో నమోదైన ఫిర్యాదుల ఆధారంగా వారిధ్దరినీ మళ్లీ అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నకిలీ ఆధార, డ్రైవింగ్ లైసెన్స్ కేసులో రామచంద్ర భారతిని, చీటింగ్ కేసులో నందకుమార్‌ను హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఇద్దరికి షాకత్ నగర్ ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఇద్దరు నిందితులను పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు.













