ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన వాణీదేవి
పట్టభద్రుల కోటాలో శాసన మండలికి ఎన్నికైన సురభి వాణీదేవి మండలి సభ్యురాలు (ఎమ్మెల్సీ)గా ప్రమాణ స్వీకారం చేశారు. మండలి చైర్మన్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వాణీ దేవితో ప్రొటెమ్ చైర్మన్ వి.భూపాల్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారానికి మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు, ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, భేతి సుభాష్ రెడ్డి, మెతుకు ఆనంద్, జైపాల్ యాదవ్, ఆల వెంకటేశ్వరెడ్డి, కాలే యాదయ్య, అంజయ్య యాదవ్, ఎమ్మెల్సీలు పురాణం సతీశ్, ఎం.ఎస్.ప్రభాకర్ రావు, తెలంగాణ శాసన సభ కార్యదర్శి డాక్టర్ నరసింహచార్యులు, వాణీదేవి కటుంబ సభ్యులు పాల్గొన్నారు.













