ఓటుకు నోటు కేసులో …రేవంత్, సండ్రలకు సుప్రీంలో ఊరట
ఓటుకు నోటు కేసులో తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సండ్ర వీరయ్యలకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఓటుకు నోటు కేసు ఏసీబీ కోర్టు పరిధిలోకి రాదంటూ రేవంత్ రెడ్డి వేసిన పిటిషన్ను కొట్టి వేస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఇదే కేసులో తన పేరును తొలగించాలంటూ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య వేసిన పిటిషన్ను తిరస్కరిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై కూడా ఉన్నతన్యాయస్థానం స్టే విధించింది. ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణను సుప్రీంకోర్టు కోర్టు సెప్టెంబర్ 7కు వాయిదా వేసింది.













