హుజూర్నగర్లో సుహాసినీ ప్రచారం
హుజూర్నగర్ ఉప ఎన్నికను తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఎన్నికల్లో గెలిచి తెలంగాణలో ఇప్పటికీ బలమైన రాజకీయ శక్తి తామేనని చాటి చెప్పడమే లక్ష్యంగా తెలుగుదేశం వ్యూహరచన చేస్తోంది. ఇందులో భాగంగా నందమూరి కుటుంబాన్ని టీడీపీ అభ్యర్థి కిరణ్మయికి మద్దతుగా రంగంలోకి దింపాలని పార్టీ నిర్ణయించింది. అక్టోబర్ 16 నుంచి హరికృష్ణ కుమార్తె సుహాసిని మూడు రోజుల పాటు కిరణ్మయికి మద్దతుగా హుజూర్నగర్ నియోజకవర్గంలో ప్రచారం చేయనున్నారు. అభ్యర్థి మహిళ కావడం, సుహాసిని ప్రచారం.. ఇలా మహిళల ఓటు బ్యాంకు తమకు అనుకూలంగా మారుతుందని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. సుహాసిని కూకట్పల్లి అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేసిన సంగతి తెలిసిందే.













