Sudheer Babu: ఫ్యూచర్ సిటీ కమిషనర్ గా సుధీర్ బాబు
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన ఫ్యూచర్ సిటీ (Future City) కమిషనరేట్ కమిషనర్‌గా జి.సుధీర్‌బాబు (Sudheer Babu) ను నియమించింది. గ్రేటర్ హైదరాబాద్‌ను మూడు మునిసిపల్ కార్పొరేషన్లుగా విభజించిన ప్రభుత్వం, వాటి పరిధిలోని ప్రాంతాలను నాలుగు పోలీస్ కమిషనరేట్లుగా పునర్విభజన చేసింది. ఇప్పటివరకు హైదరాబాద్ (Hyderabad), సైబరాబాద్, రాచకొండ (Rachakonda) కమిషనరేట్లు మాత్రమే ఉండగా, ఇప్పుడు పునర్విభజనలో భాగంగా నాలుగు కమిషనరేట్లు ఏర్పాటు చేశారు. హైదరాబాద్, సైబరాబాద్‌తోపాటు మల్కాజిగిరి, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్లుగా ఏర్పాటయ్యాయి. ఇందులో హైదరాబాద్, సైబరాబాద్‌లు పాతవే కాగా, రాచకొండ పరిధిలోని ప్రాంతాలతోనే మల్కాజిగిరి పేరుతో కొత్త కమిషనరేట్ ఏర్పాటైంది. ఫ్యూచర్‌సిటీ పేరుతో మరో నూతన కమిషనరేట్ వచ్చింది. ఈ పోలీస్ కమిషనరేట్లకు సంబంధించి కమిషనర్ల నియామకంలో భాగంగా నలుగురు ఐపీఎ్‌సలను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.






