విదేశీ కంపెనీలకు గమ్యస్థానంగా దక్షిణాది : సుచిత్ర ఎల్ల
తెలంగాణకు పెట్టుబడుల కోసం మంత్రి కేటీఆర్ కృషి చేస్తున్నారని భారత బయోటెక్ ఎండీ సుచిత్ర ఎల్ల అన్నారు. బేగంపేటలో ఏర్పాటు చేసిన సీఐఐ తెలంగాణ వార్షిక సమావేశంలో సుచిత్ర ఎల్ల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రం సాధిస్తున్న వృద్ధి వల్లే పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. పెట్టుబడిదారులకు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం బాగుందన్నారు. రాష్ట్రంలో టీఎస్ ఐపాస్ ద్వారా సెల్ఫ్ సర్టిఫికేసన్ విధానం బాగుంది. ఆవిష్కరణలను ప్రోత్సహించే టీ హబ్ మంచి ఆలోచన. పునరుత్పాదక రంగంలో పరిశ్రమలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. విదేశీ కంపెనీల పెట్టుబడులకు దక్షిణాది రాష్ట్రాలు గమ్యస్థానంగా మారాయని సుచిత్ర ఎల్ల స్పష్టం చేశారు.













