ఆస్పత్రులతో చేతులు కలిపిన స్టార్ హోటళ్లు.. కరోనా పేషెంట్ల కోసం రూమ్స్ కేటాయింపు!

భారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా కరోనా వేగంగా వ్యాపిస్తోంది. ఈ తరుణంలో కరోనా తీవ్రంగా ఉన్న వారి కన్నా, ప్రారంభ దశలో ఉన్న వారే ఎక్కువగా ఉన్నారు. ఇలాంటి వారు ఐసోలేషన్‌లో ఉండటానికి సదుపాయాలు సరిగా లేవు. ఆస్పత్రుల్లో వీరికి బెడ్లు కేటాయిస్తే, ఇన్‌ఫెక్షన్ తీవ్రంగా సోకిన వారికి బెడ్లు దొరకడం ఇబ్బందిగా మారుతుంది. ఈ క్రమంలో ఎర్లీ స్టేజ్ కరోనాతో బాధపడే వారిని ఐసోలేషన్‌లో ఉంచడం కోసం హైదరాబాద్ నగరంలోని ప్రముఖ ఆస్పత్రులు.. కొన్ని హోటళ్లతో చేతులు కలిపాయి. ఈ హోటళ్లలో ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయడానికి సదరు హోటళ్ల యాజమాన్యాలు కూడా అంగీకరించాయి. ఈ కరోనా అత్యవసర పరిస్థితిని తట్టుకోవడానికి ఏఏ ఆస్పత్రులు, ఏఏ హోటళ్లతో చేతులు కలిపాయంటే..
– యశోదా హాస్పిటల్‌తో బేగంపేటలోని గ్రీన్‌పార్క్ హోటల్, లక్డీకపూల్ లోని బెస్ట్ వెస్టర్న్ అశోక హోటల్ టై అప్ అయ్యి 130 రూమ్స్ కేటాయించాయి.
– సియస్టా హోటల్ కొండాపూర్‌లోని కిమ్స్(కెఐఎమ్ఎస్)కు 67 రూమ్స్ కేటాయించింది.
– జూబిలీ హిల్స్‌లోని అపోలో ఆస్పత్రికి ఆదిత్య హోటల్, తాజ్ బంజారా, గ్రీన్‌పార్క్ హోటళ్లు 250పైగా రూమ్స్ కేటాయించాయి.
– గచ్చిబౌలిలోని ఎఐజి హాస్పిటల్, కాంటినెంటల్ ఆస్పత్రికి కొండాపూర్‌లోని ర్యాడిసన్ 50 గదులను అందుబాటులో ఉంచింది.
– బంజారా హిల్స్‌లోని కంఫోటెల్ కేర్ హాస్పటల్‌కు 52 గదులను కేటాయించింది.
– కాంటినెంటల్ ఆస్పత్రికి మారియట్ 100 రూమ్స్‌ను అందుబాటులో ఉంచింది.
– మెడికవర్ ఆస్పత్రికి కలెక్షన్ ఓ 98 గదులను కేటాయించింది.
– లెమన్ ట్రీ హోటల్ మహావీర్ ఆస్పత్రికి 67 రూమ్స్ కేటాయించింది.
– ఓమ్నీ ఆస్పత్రికి క్యాపిటల్ ఓ అండ్ ఐస్టే హోటల్ 122 గదులను కేటాయించినట్లు తెలిపింది.
– టిఎక్స్ కాచిగూడ హాస్పిటల్‌కు టూరిస్ట్ ప్లాజా 30 గదులను అందుబాటులో ఉంచింది.
– సిటి న్యూరో ఆస్పత్రి అవసరాల కోసం గోల్కొండ హోటల్ 50 రూమ్స్ కేటాయించింది.
– విన్ హాస్పిటల్స్‌కే 82 గదులు కేటాయించినట్లు ఆదిత్య పార్క్ హోటల్ వెల్లడించింది.
కరోనా ఐసొలేషన్ సెంటర్లుగా ఉపయోగించుకోవడానికి ఈ స్టార్ హోటళ్లు ముందుకు రావడాన్ని ఆస్పత్రి వర్గాలతోపాటు, ప్రజలు కూడా స్వాగతిస్తున్నారు. ఈ హొటల్స్ అన్నీ కలిసి ఇప్పటి వరకూ మొత్తమ్మీద 1225 గదులను కరోనా పేషెంట్లకు కేటాయించాయి. ఈ సంఖ్య భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.