దాజీకి ఫ్రీడమ్ ఆఫ్ ది సిటీ ఆఫ్ లండన్ అవార్డు

తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని శ్రీ రామచంద్ర మిషన్ అధ్యక్షుడు, హార్ట్‌ఫుల్‌నెస్ ధ్యాన గురువు కమలేశ్ డీ పటేల్ (దాజీ)కు అరుదైన అవార్డు దక్కింది. ఫ్రీడమ్ ఆఫ్ ది సిటీ ఆఫ్ లండన్ అవార్డును ఆయన లండన్‌లో అందుకున్నట్టు రామ చంద్రమిషన్ పీఆర్‌వో శ్రీనివాస్ తెలిపారు. విద్య, వైద్యం, పర్యావరణ వంటి రంగాల్లో దాజీ చేసిన సేవలను గుర్తించి ఈ అవార్డును అందించారని, దీంతో పాటు కామన్వెల్త్ సెక్రటేరియట్‌తో ప్రత్యేక అవగాహన ఒప్పందం చేసుకున్నట్టు పేర్కొన్నారు.