హైదరాబాద్ నుంచి జెడ్డాకు స్పైస్ జెట్ సేవలు
ప్రైవేటు విమానయాన సంస్థ స్పైస్‌జెట్ హైదరాబాద్ నుంచి జెడ్డాకు ప్రతిరోజూ విమాన సర్వీసును ప్రారంభించింది. మార్చి 25 నుంచి ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఈ విమానం ఇక్కడి నుంచి ఉదయం 7:10కి బయలుదేరి, జెడ్డాకు ఉదయం 11:05కు (అక్కడి కాలమానం ప్రకారం) చేరుకుంటుంది. జెడ్డా నుంచి తిరిగి మధ్యాహ్నం 12:05కు బయలుదేరి రాత్రి 8:25కు హైదరాబాద్ చేరుకుంటుంది. దీనికోసం బోయింగ్ 737 మ్యాక్స్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను కేటాయించినట్లు స్పైస్‌జెట్ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రారంభ ఆఫర్లో భాగంగా హైదరాబాద్ నుంచి జెడ్డాకు రూ.13,499, అక్కడి నుంచి హైదరాబాద్‌కు రూ.10,799గా టిక్కెట్ల ధరను నిర్ణయించినట్లు పేర్కొంది.













