డెహ్రాడూన్ సదస్సుకు పోచారం, గుత్తా
అఖిల భారత చట్టసభల అధ్యక్షులు, సభాపతులు, ఉపాధ్యక్షులు, ఉప సభాపతులు, శాసన మండలి కార్యదర్శుల సదస్సు డిసెంబరు 17న ప్రారంభం కానుంది. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లో ఈ సదస్సు 4 రోజులు జరగనుంది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి వి.నరసింహాచార్యులు హాజరుకానున్నారు. 18న జరిగే ప్రిసైడింగ్ ఆఫీసర్ల సమావేశంలో భారత రాజ్యాంగంలోని 10వ షెడ్యూలు-స్పీకర్ల పాత్ర, చట్ట సభల ద్వారా పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని మరింత బలపర్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తారన్నారు. 19న అన్ని రాష్ట్రాల చట్టసభల్లో ఒకే విధమైన పార్లమెంటరీ నిబంధనలను రూపొందించడం, చట్టసభలు తరుగా ఎదుర్కొంటున్న సవాళ్లుపై చర్చిస్తారు.













