సియోల్ సందర్శనకు స్పీకర్, మండలి చైర్మన్

వచ్చే నెలలో తెలంగాణ స్పీకర్ ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిలు సియోల్ నగర సందర్శనకు వెళ్లనున్నారు. అక్కడి చంగ్ ఏ చంగ్ నది పునరుద్ధరణ, ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో హంగ్ నదిని ఆధునీకరించిన తీరును వారు ప్రత్యేకంగా పరిశీలించనున్నారు. ఆస్ట్రేలియాలో నవంబరు 2 నుంచి ప్రారంభం కానున్న కామన్‌హెల్త్ పార్లమెంట్ కాన్ఫరెన్సు( సీపీసీ)లో భాగంగా వారు సియోల్‌లో పర్యటించనున్నారు. ఈ సమావేశానికి తెలంగాణ సహా దేశంలోని అన్ని రాష్ట్రాల స్పీకర్‌లు, డిప్యూటీ స్పీకర్‌లు, మండలి చైర్మన్‌లు, డిప్యూటీ చైర్మన్‌లు, కార్యదర్శులు హాజరు కానున్నారు.